BB6TELUGUNEWSCHANNEL : పోక్సో కేసులో నిందితుడికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. జిల్లా పోలీసు కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. గండీడ్ మండలం గాదిర్యాలకు చెందిన జిలకరపురం కృష్ణయ్య(35) 2016లో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై మహమ్మదాబాద్ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. తొమ్మిదేళ్లుగా న్యాయస్థానంలో కేసుకు సంబంధించి వాదోపవాదాలు నడుస్తున్నాయి. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. రూ. 10 వేల జరిమానా వేశారు. నిందితుడికి శిక్షణ పడేందుకు కృషి చేసిన అధికారులు, పోలీసు సిబ్బంది, న్యాయవాదులను ఎస్పీ జానకి అభినందించారు.
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు . మహబూబ్ నగర్ నేరవిభాగం, మహమ్మదాబాద్
18
Jul