BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ సంస్కృతీ వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి.
రంగురంగుల పూలతో మహిళలు అందంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ కోలాటాలు వేశారు. మహిళల ఉత్సాహంతో రవీంద్రభారతి ప్రాంగణం మొత్తం పండుగ శోభ సంతరించుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి ఇచ్చిన పూలనే దైవంగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం బతుకమ్మ పండుగ సొంతమని వారు అన్నారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగలో తెలంగాణ సంస్కృతి, ప్రకృతితో మమేకమైన జీవనం, మహిళల ఆత్మీయ అనుబంధం కనిపిస్తుందని వారు తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని మంత్రులు ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారు.
ఆటపాటలతో మార్మోగిన
రవీంద్రభారతి వేదికపై ఎంగిలిపూల సందడి
10
Oct