పేదోడి బిడ్డ కూడా కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించాలి – ఇదే రేవంత్ రెడ్డి లక్ష్యం!

పేద పిల్లల కలలకు రెక్కలు – యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

BB6 TELUGU NEWS CHANNEL
పేద పిల్లల కలలకు యంగ్ ఇండియా స్కూల్స్ రెక్కలు తొడుగుతున్నాయి. తెలంగాణ భవిష్యత్తు తరాలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన అడుగులు వేస్తోంది.
“చదువు లేకపోవడం వల్లే పేదరికం వస్తుంది తప్ప, ఆస్తులు లేక కాదు” అని తేల్చి చెప్పిన సీఎం.. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ విద్యా వ్యవస్థ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం విద్యను, ఉద్యోగాన్ని తన బ్రాండ్ గా ఎంచుకుందని ప్రకటించారు. గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు.

అందుకే కులాల వారీగా ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల వివక్ష పెరుగుతోందని భావించి, అందరూ కలిసి చదువుకునేలా అత్యాధునిక ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పాఠశాలలను రూపొందిస్తున్నారు. ఒక్కో స్కూల్ ను 25 ఎకరాల విస్తీర్ణంలో, ప్రత్యేకంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తో నిర్మించబోతున్నారు. మొత్తంగా రూ.5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 28 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని పేద విద్యార్థులు కులమత భేదాలకు అతీతంగా సోదరభావంతో కలిసి చదువుకునేలా, అందరికీ ఒకేచోట భోజన ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో శంషాబాద్ మండలంలో యంగ్ ఇండియా స్కూల్ కు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం ద్వారా యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

ఎల్బీ స్టేడియం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభలో :
“పేద బడుగు బలహీన వర్గాలకు సైతం నాణ్యమైన విద్యను అందించడం మా ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు కేవలం భవనాలుగా కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలి. పాతకాలపు సిలబస్‌ను మార్చి, ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం ఉన్న ఫిన్లాండ్‌కు 25 మంది టీచర్లను అధ్యయనం కోసం పంపించాం”

అంతేకాదు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోంది.
విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, విద్యాశాఖకు కేటాయించే నిధులను 15 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. 60 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టుల భర్తీ, 36 వేల మంది టీచర్ల బదిలీలను వివాదాలు లేకుండా పూర్తి చేసింది.

మొత్తానికి, పేదోడి బిడ్డ కలెక్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా ఆ కలకు పునాది ఈ యంగ్ ఇండియా స్కూల్స్ లోనే పడాలన్నది రేవంత్ సర్కార్ సంకల్పం.

ఇది కేవలం పాఠశాలల నిర్మాణం కాదు.. తెలంగాణలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ స్కూల్స్.. రేపటి యంగ్ ఇండియాను తయారు చేస్తాయనడంలో సందేహం లేదు.

మరి నీ వార్తలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి BB6 తెలుగు న్యూస్ ఛానల్

Related News