హోలీ రోజు జర జాగ్రత్త బలవంతంగా రంగులు చల్లితే కేసులు..ఈ రూల్స్ పాటించాల్సిందే!

BB6 TELUGU NEWS CHANNEL

•పాదచారులు, వాహనాల జోలికి వెళ్తే సహించబోం

•డీజేలకు అనుమతి లేదు: సీపీ సజ్జనార్

హోలీ సందర్భంగా బలవంతంగా రంగులు చల్లితే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సజ్జనార్ మాట్లాడుతూ హోలీ సందర్భంగా విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ పెంచాలన్నారు. ఇష్టం లేని వారికి బలవంతంగా రంగులు పూయడం,పాదచారులు, వాహనాలపై రంగులు చల్లడాన్ని సహించబోమన్నారు. మహిళల రక్షణ కోసం మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంచాలన్నారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

మద్యం షాపులు బంద్
హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్,మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంచాలని పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు , రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్నారు.రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింల ప్రార్థనలకు అంతరాయం కలగకుండా చూడాలని, పీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్సీపీ తఫ్సీర్ఇక్బాల్, జాయింట్ సీపీలు శ్వేత, ఎస్ఎంవిజయ్ కుమార్, డీసీపీలు ఖారే కిరణ్ప్రభాకర్, రూపేశ్, వెంకట లక్ష్మి పాల్గొన్నారు.

హోలీ వేళ జాగ్రత్తలివీ:

•గాంధీ కంటి విభాగం హెచ్ఐడీ డా. రవిశేఖర్

•చర్మం, కండ్లకు హానికలగకుండా సహజసిద్ధమైన రంగులను మాత్రమే వాడాలి.ఆడేప్పుడు కండ్లద్దాలు పెట్టుకుంటే రంగులు కళ్లలోకి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది. రంగులు కంట్లో పడితే కళ్లను రుద్దకూడదు. శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
కండ్లు ఎర్రబారడం, మంట,వెలుగును చూడడం లోలూబ్రికేటింగ్ డ్రాప్స్ లేదా ఇబ్బంది
ఆయింట్మెంట్ వాడాలి..అవసరమైతే కంటి డాక్టర్ను సంప్రదించాలి.
రంగులు చల్లే గొట్టాలు, ఇతర వస్తువులు కంటికి తాకితే కంటిపై ఒత్తిడిచేయకుండా బ్యాండేజ్ వేసి కంటి దవాఖానకు వెళ్లాలి. చర్మ సమస్యలు రాకుండా పూర్తి శరీరాన్ని కప్పేలా బట్టలు వేసుకుంటే మంచింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe