BB6 TELUGU NEWS CHANNEL
జోగులాంబ గద్వాల : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి‘జనం బాట’ పర్యటన జిల్లాపై కనీస అవగాహన లేని ‘పెయిడ్ ముచ్చట’గా సాగిందని స్థానిక ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. గద్వాల పట్టణంలోని దౌలత్ చాయ్ హోటల్ దగ్గర జరిగిన చర్చలో కవిత టీమ్ చేసిన పొరపాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆసుపత్రిపై అవగాహన లేదు.. గద్వాలపై ప్రేమ ఉందా?
జిల్లా పర్యటనకు వచ్చిన కవితకు జిల్లాలోని ప్రధాన సమస్యలపై గానీ, వసతులపై గానీ కనీస అవగాహన లేదని స్పష్టమైంది. గద్వాల ఏరియా ఆసుపత్రిలో కేవలం 100 పడకలు మాత్రమే ఉన్నాయని కవితతో చాయ్ పే చర్చకు వచ్చిన గద్వాలకు చెందిన కొందరు అవగాహన లేని నేతలు మీడియా ముందు చెప్పగా, స్థానిక మీడియా ప్రతినిధులు వెంటనే కలుగజేసుకుని అది 300 పడకల ఆసుపత్రి అని గుర్తుచేశారు. దీంతో ఖంగుతిన్న నేతలు.. “ఈ మధ్యనే పెంచారు కదా” అంటూ గుసగుసలాడుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం అక్కడున్న వారందరికీ నవ్వు తెప్పించింది.
ఓపి (OP) లో టాప్.. వసతుల్లో వెనుకబాటు!
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి రోజుకు 1000 నుండి 2000 వరకు ఓపిలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి స్థానంలో, రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. ఇంత రద్దీ ఉన్న ఆసుపత్రిలో వసతుల లేమి ఉన్న మాట వాస్తవమే అయినా, కనీసం ఆసుపత్రి సామర్థ్యం కూడా తెలియకుండా పర్యటనకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెల్ఫీ హల్చల్.. పెయిడ్ ఆర్టిస్టులపై ఆగ్రహం
ఇక చాయ్ హోటల్ దగ్గర సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు గద్వాల వాసులు కాదని స్థానికులు మండిపడుతున్నారు. విడతల వారీగా వచ్చి హడావుడి చేసిన ఆ యువకులు కవిత ఏర్పాటు చేసుకున్న ‘పెయిడ్ ఆర్టిస్టులే’ అని, జిల్లాపై అవగాహన లేని వారితో ఇలాంటి జిమ్మిక్కులు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్య విమర్శలు:
• బెడ్ల సంఖ్యపై అజ్ఞానం: 300 బెడ్లు ఉంటే 100 అని చెప్పిన మేధావులు.
• కృత్రిమ హడావుడి: పర్యటన సక్సెస్ అని చూపించుకోవడానికి బయటి వ్యక్తులతో సెల్ఫీ డ్రామాలు.
• స్థానికుల అసహనం: నడిగడ్డ సమస్యలపై కనీస అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న యాత్రగా అభివర్ణన.
మొత్తానికి, గద్వాల అభివృద్ధిపై గళమెత్తడానికి వచ్చిన కవితక్కకు, ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియకపోవడంతో పర్యటన అంతా మొదటి రోజు గద్వాల పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత ఈ తెలిసి తెలియని పెయిడ్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో గందరగోళంగా మారి అట్టర్ ప్లాఫ్ అయిందన్న చర్చ గద్వాల నియోజకవర్గంలో నడుస్తోంది.
గద్వాల గడ్డపై కవిత ‘చాయ్ ముచ్చట’ తుస్సు.. అవగాహన లేమితో నవ్వులపాలు!
22
Dec