గండీడ్ మండలంలో గొర్రెల దొంగతనాలు బాధితులకు న్యాయం కోసం ఎంపి డి.కె.అరుణ కు వినతి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని కొమిరెడ్డిపల్లి, వెన్నాచేడ్, రంగారెడ్డిపల్లి, కొత్లాబాద్, రెడ్డిపల్లి గ్రామాల్లో దాదాపు 300కు పైగా గొర్రెలను దుండగులు దొంగిలించారు. దీనివల్ల కురువగొల్ల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్నాయి.

బాధిత కుటుంబాల న్యాయం కోసం బిజెపి నాయకుల చొరవ:

పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినా ఆచూకీ దొరకకపోవడంతో, మన మండల బిజెపి నాయకులు ఈ సమస్యను ఎంపి డి.కె.అరుణ దృష్టికి తీసుకెళ్లారు.

ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వెన్న ఈశ్వరప్ప ,రాష్ట్ర సీనియర్ నాయకులు ఏవి రాములు ,మాజీ ఎంపిపిలు కొమ్మిరి లక్ష్మయ్య , సంజీవ రెడ్డి ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీలతో మేడంని కలిసి వినతిపత్రం అందజేశారు.

తక్షణమే స్పందించిన ఎంపి డి.కె.అరుణ.
ఎంపి డి.కె.అరుణ వెంటనే స్పందించి, ఎస్పీ మేడం గారికి ఫోన్ చేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని, దొంగలను త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

డా. వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ…
దొంగతనం కారణంగా జీవనోపాధి కోల్పోయి, కష్టాల్లో ఉన్న ప్రతి కురువగొల్ల కుటుంబానికి BJP పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. దొంగలను పట్టుకునే వరకు,నష్టపోయిన వారికి న్యాయం జరిగే వరకు మేము మీ వెంటే ఉంటానని బాధపడకండి అని అన్నారు.
ధైర్యం చెప్పడమే కాదు, న్యాయం జరిగే వరకు పోరాడుతాం!! అని హామీ ఇచ్చారు.

వినతి పత్రం
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe