ఆధార్‌లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు. ఇలా ఎన్నో అవసరాలకు.

హైదరాబాద్‌, జూలై 20 (BB6NEWS): ఆధార్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్‌ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్‌లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. నిజానికి మొదట్లో తండ్రి/భర్త పేరు అని ఉండేది. తర్వాత కేరాఫ్‌ అని మార్చారు. ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి కొత్త ఆధార్‌ నమోదులో తండ్రి/భర్త వివరాలు సమర్పించాలని కోరబోమని యూఐడీఏఐ తెలిపింది. అలాగే పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు. దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తండ్రి/భర్త పేరు ఉన్న ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి. అలాగే పుట్టినతేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్‌లోనే మాత్రమే కేరాఫ్‌ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe