బిల్డర్ నుంచి రూ.4 లక్షల లంచం రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పోలీస్

BB6 TELUGU NEWS CHANNEL
లంచం తీసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా పెరిగి పోయాయి. కిందిస్థాయి ఉద్యోగి నుంచి వైట్ కాలర్ జాబ్ హోల్డర్ వరకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం కేసులలో పట్టుబడుతున్నారు.లంచం తీసుకోవడం ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. చిన్న ఉద్యోగి దగ్గర కూడా కోట్లలో అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా బెంగళూరులో లంచం తీసుకుంటూ ఓ ఎస్సె రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.. వివరాల్లోకి వెళితే…ఓ ఫ్రాడ్ కేసులో బిల్డర్నుంచి రూ.4లక్షలు లంచం తీసుకుంటుండగా
గురువారం(జనవరి 29) బెంగళూరుకు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ ను కర్ణాటక లోకాయక్త పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీలో కేపీ అగ్రహారం పోలీస్ స్టేషన్ లోపని చేస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ గొవిందరాజులు స్థానిక బిల్డర్ మహ్మద్అక్బర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయిన బిల్డర్ కు బెయిల్ ఇప్పిస్తానని అందుకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు లోకాయుక్త అధికారులు వెల్లడించారు.మొదట బిల్డర్ నుంచి రూ.లక్ష అడ్వాన్స్ గా తీసుకున్న ఆ ఇన్ స్పెక్టర్. రెండో విడత బిల్డర్ నుంచి రూ. అడ్వాన్స్ 4 లక్షలు నగదు తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో గోవిందరాజును పట్టుకున్నారు. రూ.4లక్షల విలువైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe