ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108/102 అంబులెన్స్ సేవలు భేష్  ప్రోగ్రామ్ మేనేజర్ కె రవి

BB6 TELUGU NEWS CHANNEL
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108 మరియు 102 అంబులెన్స్లు అత్యుత్తమంగా పని చేస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ కె రవి పేర్కొన్నారు.సోమవారం మండల కేంద్రంలోని 108/102 అంబులెన్స్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంబులెన్స్ లోని వివిధ రకాల పరికరాల పనితీరు మరియు మందులను పరిశీలించడం జరిగింది. 108 అంబులెన్స్ ల ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నామని ప్రమాద బాధితులను ఆపదలో ఉన్న వారిని వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు.102 అమ్మఒడి అంబులెన్స్ లు గర్భిణీ స్త్రీలు పరీక్షలు నిమిత్తం వాడుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలను ఇంటి దగ్గర దించడానికి మరియు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం అమ్మఒడి వాహనాలను వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 108 మరియు 102 అంబులెన్స్ల ద్వారా ప్రజలకు మధ్య సహాయాన్ని అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు*
*ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ సి. ఉదయ్ కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జానమ్మ, పైలెట్ అక్బర్ పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe