Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు_July 03, 2025

దిన ఫలాలు (జూలై 3, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలన్నీ బాగా కలిసి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఇంటా బయటా పని భారం పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాల బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, ఆర్థిక వ్యవహారాలన్నీ బాగా కలిసి వస్తాయి. ఆదాయం వృద్ది చెందుతుంది. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాల వృద్ది ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద దృష్టి పెట్టాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇంటా బయటా పని భారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉండవచ్చు. అయితే, కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులతో కొన్ని సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. అత్యవసర వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు చేకూరుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి దాదాపు రెట్టింపవుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. బంధు మిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో అదనపు లాభాలు అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయ ప్రయత్నాలతో పాటు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పెళ్లి విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వ్యాపారాలు నిలకడగా, నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు ఆశిం చిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చదువుల్లో పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి బాగానే గట్టెక్కుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పనిభారం పెరిగినా ప్రతిఫలం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. సమాజ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe