BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కొరకు ఇప్పటికే అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆరవతరగతి నుంచి 10 వ తరగతి వరకు అడ్మిషన్లకు పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 28 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఓబీసీలు రూ.200లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 లు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష రెండు దఫాలుగా నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరవ తరగతి విద్యార్థులకు, 7తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు సమర్పణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు షెడ్యూల్ :
దరఖాస్తుల స్వీకరణ: జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు
ఆన్లైన్ హాల్ టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 9 నుంచి
పరీక్ష తేదీ: ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష
పరీక్ష సమయం: 6వ తరగతికి ఉదయం10:00 నుంచి మ.12:00 వరకు.7 నుంచి 10వ తరగతి వరకు: మధ్యాహ్నం 2:00 నుంచి సా.4:00 వరకు.
తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్లు ధరఖాస్తులు, ఫీజు, పరీక్ష తేదీలు..ఫుల్ డిటెయిల్స్ ఇవే
30
Jan