BB6 TELUGUNEWS : Aug 06 2025,
ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయన్నంటే.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా బుధవారం, గురువారాల్లో వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
గురువారం వర్షాలు కురిసే జిల్లాలు
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.ఇప్పటికే నమోదైన వర్షపాతం
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు మండలాల్లో 6-10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 78 మండలాల్లో 2-6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నైరుతి బంగాళాఖాతం, రాయలసీమపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాయలసీమలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దక్షిణ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కూడా పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి. అయితే కొన్ని కోస్తా ప్రాంతాల్లో ఎండ ప్రభావం కొనసాగి, కావలిలో గరిష్ఠంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది? రాబోయే 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో, కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతి 2-3 రోజుల్లో కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీవర్షాలు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
Rain Alert: అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.. గురువారం ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు

06
Aug