మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసర పరిచయాలకు వీలై నంత దూరంగా ఉండడం మంచిది. పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. సొంత పనుల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడ తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవు తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూ లంగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగి, ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )
ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొద్ది శ్రమతో ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగు తాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను, లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ విషయాల్లో తొందరపాటుతో వ్యవహరించ వద్దు. ఆస్తి వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. పని భారం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది లాభాలతో సాగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

15
Jul