విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
– ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా .. రాష్ట్ర ఐటీ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
– ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారు .. యోగా డే ఏర్పాట్లపై సీఎం టీం ను అభినందించిన ప్రధాని మోడీ.
– కాపులుప్పాడలో ప్రపంచస్థాయి ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ స్థాపించనున్న కాగ్నిజెంట్..ఫలించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కృషి.
– “అమ్మా మీరే నా బలం, నా మార్గదర్శి, మా కుటుంబానికి సర్వస్వం” ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
ప్రధాని మోదీ సందేశం యోగా మనల్ని నడిపిస్తుంది. యోగా మనల్ని మేల్కొలుపుతుంది. యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరు. ప్రపంచ గమనాన్ని మార్చింది యోగా. వన్‌ఎర్త్.. ఎన్ హెల్త్ థీమ్‌తో ఈసారి యోగా దినోత్సవాన్ని నిర్వహించాం. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అభివృద్ధి చేస్తోంది. యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇకో సిస్టంని డెవలప్ చేస్తున్నాం. యోగా గురించి మన్ కీ బాత్‌లో కూడా విస్త్రృతంగా చర్చించాను. రోజూ మనం తినే ఆహారంలో 10 శాతం నూనె తగ్గించాలి. సంతులిత జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. -ప్రధాని మోడీ
