BB6 TELUGU NEWS CHANNEL : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు మూడు రెట్లు పెరిగిందని తాజా నివేదిక సంచలనం రేపుతోంది. మొత్తం భారతీయుల నగదు సుమారు ₹37,600 కోట్లకు చేరింది. అయితే, ఇందులో ఎక్కువ భాగం స్థానిక సంస్థల ద్వారా వచ్చిన నిధులే. గతంలో తగ్గిన డిపాజిట్లు మళ్లీ పెరగడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇది బ్లాక్ మనీనా? ఇతర దేశాల డిపాజిట్లు పరిస్థితి ఏంటి? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే!
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగినట్టు తాజా నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.., 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు డిపాజిట్లు మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సుమారు ₹37,600 కోట్లకు) చేరింది. ఈ పెరుగుదలకు ప్రధానంగా స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చిన నిధులే వృద్ధే కారణం. అయితే, ప్రత్యక్షంగా కస్టమర్ ఖాతాలలో ఉన్న నగదు కేవలం 11 శాతం మాత్రమే పెరిగి 346 మిలియన్ స్విస్ట్ ఫ్రాంకులు (సుమారు ₹3,675 కోట్లు)**కి చేరుకుంది. ఇది మొత్తం నిధులలో దాదాపు పదో వంతు మాత్రమే.
స్విస్ గణాంకాల ప్రకారం 2023లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా తగ్గి.. ఇప్పుడు తిరిగి పెరుగుదల నమోదుచేశాయి. 2023లో వ్యక్తులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నగుదు 70 శాతం తగ్గి, నాలుగేళ్ల కనిష్ఠం 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు పడిపోయింది. కానీ 2024లో ఈ మొత్తం మళ్లీ భారీగా పెరగడం గమనార్హం. 2021 తర్వాత అత్యధిక స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది భారతీయుల బ్యాలెన్సులు 14 ఏళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ఏకంగా 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకున్నాయి.
స్విస్ బ్యాంకుల్లో మూడింతలు పెరిగిన భారతీయుల డబ్బు.. 2021 తర్వాత తొలిసారి!

19
Jun