గంజాయి అమ్ముతున్న వారిని అరెస్టు చేసిన పిడుగురాళ్ల పోలీసులు

గంజాయి అమ్ముతున్న వారిని అరెస్టు చేసిన పిడుగురాళ్ల పోలీసులు.
యువతే వీళ్ళ టార్గెట్… మమ్మల్ని ఎవరు పట్టుకునేది అనే రీతిలో ఎన్నో నెలలు గా గాంజాయి అమ్ముతున్న వాళ్లకు చెక్ పెట్టారు పిడుగురాళ్ల పట్టణ పోలీసులు…


పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురజాల డివిజన్ డిఎస్పి జగదీష్ పర్యవేక్షణలో పిడుగురాళ్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు ఆధ్వర్యంలో రాబట్టిన సమాచారం మేరకు…

పిడుగురాళ్ల పట్టణ శివారు కళ్ళం టౌన్షిప్ పరిధిలో 60 అడుగుల రోడ్డు చివర గుబురుగా ఉన్న చెట్ల పొదల వద్ద కొంతమంది గంజాయి కలిగి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే… సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు  చేపట్టిన తనిఖిలలో భాగంగా .. AP39RF-0767 స్కూటీ లో తొమ్మిది మంది గంజాయి అమ్మటాన్ని గుర్తించారు.. వీరులో ఇద్దరు పరారీలో ఉన్నారు

వీరు వద్ద నుండి మొత్తం ఆరు కిలోల 400 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగినది.

పరారీలో ఉన్న ఇద్దరూ ఒరిస్సా నుండి విశాఖపట్నం టూ పిడుగురాళ్లకు కేజీ 5000రూపాయల తక్కువ రేటుకు కొనుక్కొని ఇక్కడ 10 గ్రాములు వందల్లో అమ్మడం గమనార్హం

పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పి జగదీష్ ప్రెస్ మీట్ లో తెలిపారు


డిఎస్పి జగదీశ్ హెచ్చరిక..


గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు సమాజానికి తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను కొనుగోలు చేసిన, విక్రయం చేసిన, రవాణా చేసిన చట్టపరమైన తీవ్రమైన నేరమని హెచ్చరించారు .ఎవరికైనా గంజాయి మాదక ద్రవ్యాలపై.. సమాచారం అందితే 112 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు వారి సిబ్బందిని డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు

గంజాయి కలిగి అరెస్టు అయిన నిందితుల వివరాలు….

1)వెన్ను తిరుమలరావు
S/O ఆంజనేయులు కులం (మేర)
చెరువు కట్ట బజారు పిడుగురాళ్ల

2)సాదుపాటి రాజేష్ సన్నాఫ్ సాంబశివరావు కులం.. ఎరుకల
బ్రహ్మానంద రెడ్డి కాలనీ పిడుగురాళ్ల

3) నున్నావా శివకుమార్ నాయక్
సన్నాఫ్ గోవింద నాయక్ కులం సుగాలి
కళ్ళంటౌన్షిప్
పిడుగురాళ్ల

4) సాదుపాటి గోపి సన్నాఫ్ శ్రీనివాసరావు కులం ఎరుకల
బ్రహ్మానంద రెడ్డి కాలనీ పిడుగురాళ్ల

5) షేక్ బాబావాలి సన్నాఫ్ ఖాదర్ వలీ
కులం ముస్లిం కొండమూడు
రాజుపాలెం మండలం

6) తాడిమల్ల దివ్య బాల డాటర్ ఆఫ్ చిన్నకృష్ణ కులం హరిజనమాల
ఎస్టీ కాలనీ
పిడుగురాళ్ల

7) డేగల శిరీష
డాటర్ ఆఫ్ రంగ
కులం ముదిరాజు
ఎస్టి కాలనీ
పిడుగురాళ్ల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe