డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు – పోలీసుల యూనిఫాం ఆంక్షలపై ఆందోళన

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు, వారితో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు సిబ్బంది యూనిఫాం‌తో పాటు మాల ధరించరాదన్న ఆంక్షలపై స్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు “హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి” అని వారు ఆరోపించారు.ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ముందుకు రావడంతో స్వాములు – కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కొందరిని తాత్కాలికంగా అరెస్ట్ చేశారు.

అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ—

పోలీసుల్లో అయ్యప్ప మాల ధారణను ఆపడం అన్యాయం.మతాచారాలకు విఘాతం కలిగించే ఆంక్షలను వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు.డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe