సౌదీ బస్సు ప్రమాదం మృతుల్లో తెలంగాణ హైదరాబాద్ బజార్ ఘాట్ కు చెందిన వాళ్ళు 18 మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

BB6 TELUGU NEWS CHANNEL
*సౌదీ బస్సు ప్రమాద ఘటన*
*కంట్రోల్ రూమ్ నంబర్లు:*
*+91 79979 59754*
*+91 99129 19545*
———–
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని వస్తున్న ప్రాథమిక సమాచారంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు.

ఈ దుర్ఘటనపై విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని, తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు వెంటనే ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ తో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.

ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
+91 79979 59754
+91 99129 19545

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe