జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్కట్ పల్లి లో ఆకస్మికంగా సందర్శించిన విద్యా కమిషన్ సభ్యులు

BB6 TELUGU NEWS CHANNEL : ( శేఖర్ ) నార్కట్ పల్లి :తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్  నీ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు భవిష్యత్తు జీవితంలో విజయం సాధించడానికి విద్యార్థి జీవితాన్ని ఎలా పునాది చేసుకోవాలో తెలియజేస్తూ వారు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్కెట్పల్లి టీచర్స్ బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. దీనిని అందరూ అనుసరించాలని చెప్పారు. ఈ పాఠశాలలో విద్యార్థులు చాలా క్రమశిక్షణగా ఉన్నారని, ఇది తనకు ఆచార్యాన్ని కలిగించిందని చార్కొండ వెంకటేష్ గారు అన్నారు. ఆ తర్వాత నార్కెట్పల్లి మండల స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులకు ఇవ్వబడుతున్న స్వచ్ఛ విద్యాలయ హరిత విద్యాలయ’ ఓరియంటేషన్ హాల్ ను సందర్శించి ప్రధాన ఉపాధ్యాయులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ కోసం ఇప్పటికీ చాలా చేసిందని, బదిలీలు, పదోన్నతులు, నూతన టీచర్స్ రిక్రూట్మెంట్ ద్వారా టీచర్లను ప్రభుత్వం సంతృప్తి పరిచిందని, ఇక టీచర్స్ బాగా పనిచేసే ప్రభుత్వ బడులకు వచ్చే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు. నార్కెట్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పిస్తా నాని ఆయన తెలియజేశారు. వారి వెంట జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి, మండల విద్యాధికారి కుకుట్ల నరసింహ, పాఠశాల ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు డి రాములు ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe