BB6 TELUGU NEWS CHANNEL :
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, దామర్గిద్ద, సింగరేణి X రోడ్స్, నారాయణపేట జిల్లా.. ఈరోజు అంటే 29.08.2025న ACB నల్గొండ & మహబూబ్ నగర్ జిల్లాలో రెండుచోట్ల ఒకేసారి ఏసీబీ దాడులు నిర్వహించింది.
1) ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల హాస్టల్, రామన్నపేట (V & M), యాదాద్రి భువనగిరి జిల్లా..
2) తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, దామర్గిద్ద, సింగరేణి X రోడ్స్, నారాయణపేట పట్టణం & జిల్లా వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ACB బృందాలకు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు ఆడిటర్ సహాయం చేసి ఆహారం నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థుల బలం వివరాలు, హాస్టళ్ల రికార్డులను తనిఖీ చేశారు. సోదాల సమయంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపబడుతోంది అని అధికారులు తెలిపారు.
ఒకేసారి రెండు చోట్ల ఏసీబీ దాడులు నల్గొండ మరియు నారాయణపేట జిల్లాలో

29
Aug