BB6 TELUGU NEWS 18 Aug 2025 :
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి,IPS ఆదేశాల మేరకు ఆదివారం
మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ” తెలంగాణ మోడల్ స్కూల్ వెన్నాచేడు గ్రామంలో “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి
సురక్ష పోలీసు కళా బృందం పాటలతో,మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, మరియు షిటీమ్ సభ్యులు మాటలతో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు.
“పోలీసుల ఉనికి మీ భద్రత కోసం” చట్టపరంగా జీవించే వారు భయపడాల్సిన అవసరం లేదు.”
“కలసి మెలసి ఉండాల్సిన చోట వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం.”
అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారని.
“కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని. అలాంటి వారికి ఇంటా బయట కనీస మర్యాదలు విలువలు లేకుండా పోతాయని
“మహిళలు బాలికల పట్ల గౌరవం తప్పనిసరి . వేధింపులపై శిక్షలు తీవ్రంగా ఉంటాయి.”
ముఖ్యంగా బాలికలు చదువుకునే వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు అని మోహ వ్యామొహాలకు లోనై చిన్న చిన్న ఆకర్షణలకు గురై విలువైన జీవితాన్ని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని అన్నారు.మహిళలు విధ్యారినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే షిటీమ్ కొండంత అండగా ఉంటుంది.సమాచారం ఇచ్చి సహాయం పొందండి అని అన్నారు. బాధిత బాలికలకు మహిళలకు భరోసా, సఖీ సెంటర్ల ద్వారా మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
“సైబర్ మోసాలకు లొంగకండి, ఆశలకు బలి కాకండి.”ఒకవేళ సైబర్ మోసానికి గురై నష్టపోయినప్పుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 సంప్రదించి సహాయం పొందండి అన్నారు.
“యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి. వారికి పెద్దలు ఆదర్శంగా ఉండి మహబూబ్ నగర్ జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానికి IPS సంకల్పాన్ని వివరించారు. ప్రజలతో పోలీసుల భాగస్వామ్యం ద్వారా సమాజ శాంతి భద్రతలు మెరుగుపడతాయని, సమస్యలు ఉన్నచో నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది
సురక్ష పోలీసు కళాబృందం షిటీమ్ మరియు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సభ్యులు ,ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ మోడల్ స్కూల్ వెన్నాచేడు గ్రామంలో “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం

18
Aug