TGSRTC: విద్యార్థులకు గుడ్ న్యూస్..

TGSRTC ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు ఆహ్వానం ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

BB6 TELUGU NEWS  8 Aug 2025 :
హైదరాబాద్: ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ శివారులోని హకీంపేట్ లో TSRTC ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హతతో మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లో కోర్సులు అందిస్తున్నట్లు పేర్కొంది. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 28లోగా తమ వెబ్సైట్లో


http://iti. telangana. gov.in

Related News


దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వాక్ ఇన్ ఫేజ్లో ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు మరింత సమాచారం కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.
మెకానిక్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఒక ఏడాది కోర్సులు కాగా.. మెకానిక్ (మోటర్ వెహికల్), పెయింట్ కోర్సులు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వెల్డర్, పెయింటర్ కోర్సులకు ఎనిమిదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు.ఈ కోర్సులకు ఏడాదికి రూ.16,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe