BB6 TELUGU NEWS 8 Aug 2025 :
వికారాబాద్ జిల్లా ,కుల్కచర్ల మండలం
బండయెల్కచెర్ల లో టిబి ముక్త అభియాన్ కార్యక్రమము నిర్వహించారు. కుల్కచర్ల మండలం బండయెల్కచెర్ల సబ్ సెంటర్ పరిధిలో మోడల్ స్కూల్ ,రాంనగర్, చిల్లాపూర్ బొంరెడ్డిపల్లి లో టిబి ముక్తాభియాన్ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధ రక్తపోటు హెచ్ఐవి ధూమపానము మధుమేహము తదుపరి వ్యాధులపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి cy-tb టెస్ట్ డోస్20 మందికి ఇవ్వడం జరిగింది. ఎక్స్రే పరీక్షకు 35 మంది పంపించినారు. పరీక్షలు అవసరమైన వారికి చేయించినారు .15 రోజుల పైబడిన వారికి దగ్గు ఛాతిలో నొప్పి జ్వరము బరువు తగ్గుట ఆయాసము ఉన్నవారు కచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలి, అని పౌష్టికాహారం కొరకు ప్రతి టిబి పేషెంటుకు 1000 రూపాయలు ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడును. మరియు వీరికి 6 నెలలు మందులు ఉచితంగా అందించబడును అదేవిధంగా హెచ్ఐవి తో ఉన్న ప్రతి ఒక్కరూ తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించినారు. ఈ కార్యక్రమము 100 రోజులు టిబి అవగాహన కల్పించడం. సర్వే చేయించి 70మందికి పేషెంట్స్ ను గుర్తించడం, ఇందులో 35 మంది పేషెంట్లు ఎక్స్రేకు వికారాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. వారికి మందులు సరఫరా చేయడము జరుగుతుందని జిల్లా టిబి అధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ , Dr కిరణ్ కుమార్ గౌడ్ , మెడికల్ ఆఫీసర్ క్యాంపులకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు యాదమ్మ, హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య, గోపాల్ ,టిబి హెల్త్ విజిటార్ రాజు నాయక్, YRJ కేర్ NGO సిబ్బంది రామచంద్రయ్య ,రాములమ్మ మరియు ఏఎన్ఎం సుజాత ,ఆశలు ,ప్రజలు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా బండయెల్కచెర్ల సబ్ సెంటర్ పరిధిలో టిబి ముక్తాభియాన్ కార్యక్రమము

08
Aug