అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కుమారుడు గొడ్డలితో నరికి చంపాడు. మారేడుమిల్లి మండలం తుర్రవాడలో ఈ ఘటన జరిగింది. డబ్బులు ఇవ్వలేదని కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడికి మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
దారుణం.. తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

20
Jul