ఛత్తీస్‌గఢ్‌: నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌.ఆరుగురు మావోయిస్టులు మృతి కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Chhattisgarh: నారాయణాపూర్లో భారీ ఎన్ కౌంటర్,ఆరుగురు మావోయిస్టులు మృతి..Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారంభద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులుచోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లోఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఈఘటన తర్వాత, ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47/ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను, నిత్యావసర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్
కొనసాగుతున్నట్లు చెప్పారు.ఓవైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్ కౌంటర్లతో ఛత్తీస్గఢ్ మావోయిస్టులు దశ అంతానికి వచ్చింది. ఆపరేషన్ కగార్తో భద్రతా బలగాలు మావోయిస్టుల్ని తుడిచి పెడుతున్నాయి.మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈనెల ప్రారంభంలో ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో ఏకంగా రూ.1.18 కోట్ల బహుమతి ఉన్న 23 మందిన నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 11 మంది సీనియర్ కేడర్లు, 9మంది మహిళలు ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe