- హైదరాబాద్: నగరంలో వర్షం కుండపోతగా కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీనగర్, సుచిత్ర, బాలానగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి.
రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం

18
Jul