కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు యెమెన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.. అయితే.. యెమెన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది. ఈ క్రమంలో యెమెన్ కేరళ నర్సు నిమిషా ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం.. గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది. జులై 16 (బుధవారం) ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో యెమెన్ చివరి క్షణంలో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం.. గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమిషప్రియ విడుదల కోసం.. కంఠాపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత, నిమిషప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, లీగల్ కమిటీ సభ్యులు.. కుటుంబ సభ్యులు చర్చలలో పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. నిమిషాను కాపాడడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరి క్షణంలో కూడా ఉరిశిక్షను ఆపాలని కేంద్రం యెమెన్ ప్రభుత్వాన్ని కోరింది. బాధితుడి కుటుంబానికి రూ. 11 కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. చివరిక్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే..
2017లో తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటోంది నిమిషా ప్రియ. తన పాస్‌పోర్ట్‌ను అతని దగ్గరి నుంచి డి తిరిగి పొందడానికి తలాల్ అబ్దో మహదీ కి ఇచ్చిన మత్తు అధిక మోతాదు కావడం వల్ల అతడు చనిపోయాడని పేర్కొన్నారు నిమిషా ప్రియ . నిమిషా ప్రియను ఉరిశిక్ష నుండి కాపాడటానికి బాధితురాలి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించే అంశాన్ని పరిశీలించాలని యెమెన్‌లో షరియా చట్టం ప్రకారం ఈ నిబంధన అనుమతించబడిందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నిమిషా ప్రియను కాపాడేందుకు బాధితురాలి కుటుంబానికి $1 మిలియన్ (₹8.6 కోట్లు) ‘బ్లడ్ మనీ’గా ప్రియ కుటుంబం అందించేందుకు సిద్దమయ్యింది.
కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిషా ప్రియ 2011లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. 2014లో యెమెన్‌లో యుద్దం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు నిమిషా ప్రియ భర్త , కుమార్తె. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి యెమెన్ లో ఉండిపోయారు నిమిషా యెమెన్ చట్టం ప్రకారం విదేశీ వైద్య నిపుణులు అక్కడ క్లినిక్ తెరవాలనుకుంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి . దీంతో తలాల్ అబ్దో మహదీతో వ్యాపారం ప్రారంభించిన నిమిషా ప్రియ. తనను పెళ్లి చేసుకున్నట్టు తప్పుడు పత్రాలను సృష్టించి , పాస్‌పోర్ట్‌ను నిలిపివేసాడని, ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడని, ఆర్థిక దోపిడీకి, పదే పదే బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు న నిమిషా ప్రియ . 2017లో తన పాస్‌పోర్ట్‌ను లాక్కొని యెమెన్‌ను విడిచి వెళ్లాలనే లక్ష్యంతో మహదిని మత్తులో పడేయడానికి ప్రయత్నింంది నిమిషా. కానీ మత్తు మోతాదు మించి చనిపోయాడు తలాల్ అబ్దో మహదీ. తలాల్ అబ్దో మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసినట్టు నిమిషా ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో 2020 లో ప్రియకు మరణశిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. ప్రియా మరణ శిక్షను 2023లో సమర్థించింది హౌతీల సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్..
Nimisha Priya Death Sentence: అమ్మయ్య.. యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా..

15
Jul