Air India Crash Report: జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక విడుదలైంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక
ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో ముఖ్యమైన విషయాలు
విమానం స్టార్ట్ అయ్యాక గరిష్ఠ వేగాన్ని అందుకుంది
అదే సమయంలో ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఆగిపోయాయి
ఫ్యుయెల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారాయి
సెకన్ల వ్యవధిలో ఇంజిన్లకు నిలిచిపోయిన ఫ్యుయెల్
ఇంజిన్‌ను ఎందుకు ఆఫ్ చేశారని..
పైలట్‌ను అడిగినట్టు కాక్‌పిట్‌లో రికార్డయింది
రెండో పైలట్ తాను ఇంజిన్‌ను ఆఫ్ చేయలేదని చెప్పాడు
టేకాఫ్ అయిన వెంటనే విమాన RAT బయటకొచ్చింది
రెండు ఇంజిన్ల స్విచ్‌లను రన్‌లో తిరిగి ఉంచారు
ఇంజిన్ 1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైంది
ఇంజిన్ 2 ప్రారంభమైంది కానీ పవర్ అందుకోలేదు
మ.1:39కి పైలట్ మేడే కాల్ ఇచ్చారు-AAIB నివేదిక
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెస్పాన్స్ అయ్యింది
కానీ పైలట్ నుంచి తిరిగి రెస్పాన్స్ రాలేదు
ఎయిర్‌పోర్టు గోడను దాటే ముందు విమానం కూలిపోయింది
సీసీ ఫుటేజ్‌లో పక్షి ఢీకొన్న సంఘటన ఏదీ కనిపించలేదు
మ.1:44 గంటలకు ఫైరింజన్లు వెళ్లాయి-AAIB నివేదిక
ప్రమాద స్థలాన్ని డ్రోన్‌తో రికార్డింగ్ జరిగింది
శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు
ఇంజిన్లు, ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారు
విమానంలో ఫ్యుయెల్ సరైనదేనని తేలింది-AAIB నివేదిక
Air India Crash: విమానం అందుకే కూలిపోయింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక!

12
Jul