మేష రాశి వారికి ఆదాయ ప్రయత్నాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఉద్యోగంలో బాధ్యతల భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో సహా ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం తలపెడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల మీద శ్రద్ధ పెట్ట డం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులకు ఆర్థిక సహాయం అందిస్తారు. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. బాధ్యతలు మారే అవకాశం ఉంది. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు గడిస్తాయి. మీ సలహాలు, సూచనలు బంధుమిత్రులకు ఉపయోగపడతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో తప్పకుండా అదనపు బాధ్యతలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొన సాగుతాయి. ఆదాయ వృద్దికి బాగా శ్రమపడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అత్యవసర వ్యవహారాలు, ముఖ్యమైన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థికపరంగా కొద్దిగా పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మంచి గుర్తింపు లభించడంతో పాటు పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా సంతృప్తికరంగా ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని కొద్ది శ్రమతో చక్కబెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. తొందరపడి ఎవరికీ ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వవద్దు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.