Telangana and AP Weather Forecast Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉత్తరాంధ్రలో కుమ్మేస్తుంది!

Telangana and AP Weather Forecast Update: చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు తగ్గాయి. వర్షం కురిసేందుకు అవకాశాలు పెరిగాయి. భూమి ఉపరితలంపై ఉన్న అల్పపీడనం.. మంచి ప్రభావం చూపిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణ భారత్ అంతటా.. ఓ వారం పాటూ.. ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. అలాగే జూన్ 30, జులై 1న కోస్తాంధ్ర, యానాంలో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది అని IMD చెప్పింది. ఇక కేరళలో జులై 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, కర్ణాటకలో జులై 2 నుంచి 5 వరకూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం:
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రోజంతా మేఘాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల భారీగా కూడా పడుతుంది. ఉత్తరాంధ్రపై సుడి గాలులు వీస్తున్నాయి. అందువల్ల అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాయలసీమలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe