పౌడర్ రూపంలో గోల్డ్ స్మ‌గ్లింగ్ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్‌

ముంబై : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ అక్రమ రవాణాలో మొత్తం 4.44 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.కస్టమ్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, బంగారాన్ని పౌడర్ రూపంలో మార్చి, అది గుర్తించకుండా సాక్సుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులే బంగారం తరలించేందుకు సహకరిస్తున్నారని గుర్తించిన అధికారులు… ఇద్దరు ఉద్యోగులను అరెస్టు విచారిస్తున్నారు.
ఈ ముఠా వెనుక మరెంతమంది ఉన్నారనే దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విమానాశ్రయ సెక్యూరిటీతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీలతో కలిసి మిగతా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe