BB6 TELUGU NEWS 15 Aug 2025 :
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని జెండా వందనం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి కపోతాలను ఎగురవేయడం జరిగింది. అనంతరం విద్యార్థిని విద్యార్ధులు చేసిన NCC మార్చ్ ఫాస్ట్ కు యరపతినేని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు పిరమిడ్ ప్రదర్శనలతో అలరించారు. వేడుకలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఎంతోమంది త్యాగధనుల ఫలితమే ఈ స్వాతంత్రమన్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

15
Aug