BB6 TELUGU NEWS 15 Aug 2025 :
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి లోని ఎఫ్ ఆర్ టి ఐ జోనల్ కార్యాలయం లో ఆ సంస్థ నేషనల్ జాయింట్ సెక్రటరీ కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.రేవతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించి ఈ దేశ ప్రజలు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలలో ఫోరం ఫర్ ఆర్టీఐ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కరాటే చంద్ర శేఖర్ రాయల్, జిల్లా జనరల్ సెక్రటరీ వెంకట్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ రాయ్, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గుణ, కడప జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి,లీగల్ వింగ్ సెక్రెటరీ మహా లక్ష్మీ,తిరుపతి టౌన్ సెక్రటరీ వేణు గోపాల్, తిరుపతి అర్బన్ మహిళా అధ్యక్షులు సుజాత,పుత్తూరు మండలం
మహిళా అధ్యక్షులు జయంతి, ఆక్టివ్ నాయకత్వాలు శివ,దాము,రాజేష్, రాణి,బాబు రెడ్డి, పుణ్యవతి, శేఖర్, రాధ, రాణి,తదితరులు పాల్గొని బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలు నుంచి, మనల్ని విముక్తి చేయటానికి మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్ర్య సమర వీరులు,మహానుభావులు, వీరవనితలు త్యాగాల ను స్మరించుకుంటూ, మన దేశ ప్రజలు అందరూ కూడా,తమ హక్కులను, అలాగే విధులనూ కూడా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ,ఈ దేశ సమగ్రతను అన్ని విధాలా పరిరక్షించాలని,నీతి, నిజాయితీ,నిబద్ధతతో మెలగాలని వారి ఉపన్యాసాల ద్వారా వెలిబుచ్చారు.
ఎఫ్ ఆర్ టీ ఐ ఆధ్వర్యంలో ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు

15
Aug