డిజిటల్ యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ మోసాలు కూడా అంతే రేంజ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సైబర్ మోసగాళ్ల బారినపడి భారీగా నష్టపోయారు.
ఇప్పటికే ఉన్న సైబర్ మోసాలు సరిపోవంటూ.. తాజాగా మరో కొత్త ఆన్‌లైన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇది వేగంగా విస్తరిస్తోంది. దాని గురించి తెలుసుకోని.. దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అంతకంటే ముందు అసలు ఆ స్కామ్ ఏంటో చూద్దాం.
నిందితులు టెలిగ్రామ్ బాట్ ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా నకిలీ ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (APK) ఫైల్‌లను పంపడం ద్వారా బాధితులను మోసం చేస్తున్నారు. మొబైల్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఈ APK ఫైల్‌లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు దొంగిలిస్తారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది.
వాట్సాప్‌లో ఈ మేసేజ్ వస్తే జాగ్రత్త
వణుకు|పుట్టిస్తున్న కొత్త ఆన్‌లైన్ స్కామ్.

22
Jul