School Teachers: టీచర్లకూ ముఖ గుర్తింపు హాజరు !  ( ఫేషియల్రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ )

సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలురెండేళ్ల క్రితమే యాప్ సిద్ధం.. ఇప్పటికే విద్యార్థులకు అమలు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ – ఎస్ఆర్ఎస్) అమలుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది.విద్యార్థులు, టీచర్ల హాజరు కోసం దాదాపు రెండేళ్లక్రితమే యాప్ను రూపొందించిన విద్యాశాఖ.. అప్పటినుంచి విద్యార్థులకు అమలు చేస్తోంది. తాజాగాఉపాధ్యాయులకూ అమలు చేయాలని సన్నాహాలుచేస్తోంది. ఈ మేరకు సర్కారు అనుమతిని కోరుతూప్రతిపాదనలు పంపింది. విద్యాశాఖ బాధ్యతలూచూస్తున్న సీఎం రేవంత్రెడ్డి పచ్చజెండా ఊపిన వెంటనేఎస్ఆర్ఎస్ను అమలు చేసేందుకు అధికారులుసిద్ధమయ్యారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈయాప్ను పాఠశాల విద్యాశాఖ 2023 సెప్టెంబరులో రూపొందించింది. ముఖ గుర్తింపు హాజరు నమోదుకుపరికరాలు ఏమీ ఉండవు. కేవలం యాప్తోనే హాజరునమోదు చేస్తారు. 2023 సెప్టెంబరు నుంచేవిద్యార్థులకు దీన్ని అమలు చేస్తున్నారు. హెచ్ఎం లేఉపాధ్యాయుడి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరునమోదవుతుంది. ఒకేసారి 15-20 మంది వైపు కూడాచూపించి హాజరు తీసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులసంఖ్య, మధ్యాహ్న భోజనం వినియోగించుకున్న వారిసంఖ్యను అధికంగా చూపడం లాంటి అక్రమాలకుఅడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.గత డిసెంబరు నుంచి పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా…
పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది డిసెంబరు నుంచిప్రయోగాత్మకంగా విద్యార్థులతోపాటు టీచర్లకూ ముఖగుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. పాఠశాలప్రాంగణంలో ఉంటేనే టీచర్ హాజరు నమోదుచేయడానికి వీలవుతుంది. ఆ జిల్లా యంత్రాంగం కృషికారణంగా పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైందని,పాఠశాల సమయానికి ముందే టీచర్లుహాజరవుతున్నారని, వారి హాజరు శాతం పెరిగిందనివిద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనిమిగిలిన 32 జిల్లాల్లో అమలు చేయాలనిభావిస్తున్నారు. ఇప్పటికీ కొందరు ఆలస్యంగాపాఠశాలలకు హాజరవుతున్నారని.. కొన్ని జిల్లాల్లో| పలువురు టీచర్లు తమ బదులు విద్యా వాలంటీర్లనునియమిస్తున్నారని, గత ఏడాది సంగారెడ్డి, ఖమ్మంజిల్లాల్లో అలాంటి ఉదంతాలు వెలుగు చూశాయనిఅధికారవర్గాలు చెబుతున్నాయి. కొందరు ఏడాదంతాబడి ముఖం చూడని వారున్నారని, అలాంటి వారినికట్టడి చేయవచ్చని ఆ వర్గాలు భావిస్తున్నాయి.’సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నారు.పాఠాలు చెబుతున్నారన్న నమ్మకం తల్లిదండ్రుల్లోకలిగితేనే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అది కలగాలంటే ఎస్ఆర్ఎస్ అమలుచేయడం తప్పనిసరి’ అని కొత్తగూడెం జిల్లా కేంద్రానికిచెందిన ఒక హెచ్ఎం వ్యాఖ్యానించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe