అంగన్వాడీ గుడ్లకు మళ్లీ టెండర్లు!..కొత్త గైడ్ లైన్స్ తో నిర్వహణకు సర్కారు నిర్ణయం

Telangana: అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కోసం కొత్త గైడ్లైన్స్ తో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు స్టార్ట్ అయినా ఇంకా గుడ్ల టెండర్లు ఖరారు కాకపోవడంతో పాత కాంట్రాక్టర్లే సోమవారం వరకు గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సాధ్యమైనంత త్వరలో టెండర్లు ఖరారు చేయాలని ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చ్ 30న టెండర్ పిలవగా ఇప్పటికి 5 సార్లు గడువును పొడిగించారు. ఈ గడువు కూడా సోమవారంతో ముగియనుంది.అయితే, మళ్లీ పాత పద్ధతిలోనే అంగన్వాడీలకు గుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe