ముఖ్యఅతిథిగా పాల్గొన్న వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి

ఈ సమావేశంలో డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి పీసీసీ ఉపాధ్యక్షులు MGR వినోద్ కుమార్ రెడ్డి కోఅబ్జర్వర్,రామ్ శేటి నరేందర్ ప్రాథమిక బ్యాంక్ అధ్యక్షులు కనకం మొగులయ్య బి బ్లాక్ టు అధ్యక్షులు కర్రె భరత్ కుమార్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ మండల నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని,నియోజకవర్గంలోని అన్ని మండలాలు,గ్రామాల్లో పార్టీ అధ్యక్షులుగా పనిచేసేందుకు నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు.పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించి వారి గెలుపునకు కృషి చేస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు.