BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మొదటి రోజు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఎఫ్.ఎల్.ఎస్ (ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ) మూడవ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షకు సన్నద్ధం చేయాలి.
అదేవిధంగా పాఠశాలల వారీగా మిడ్ లైన్ టెస్ట్ అసెస్మెంట్ ఫలితాల గురించి చర్చించడం జరిగింది. ఎఫ్.ఎల్.ఎస్ మాక్ టెస్ట్ ఫలితాల గురించి ప్రతి పాఠశాల నుంచి ఒక్కక్క ఉపాధ్యాయుడు మాట్లాడడం జరిగింది. ఆపార్ ఐడి ప్రతి విద్యార్థికి చేయించాలని ఎస్సీ ఎస్టి విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేయించాలని చెప్పారు.కార్యక్రమంలో మండల ఎంఈఓ రుద్రారం జనార్ధన్, సల్కర్ పేట్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మి, ఆర్.పి.లు మహిపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, కుర్మయ్య,కృష్ణారెడ్డి, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సేవియా, కిషన్, లక్ష్మణ్ ,శ్రీనివాస్,అంగడి అరుణదేవి, మంజుల,భారతి, పి. ఆర్. టి.యు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టి.ఎస్.యు.టి.ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, టి.జి.యు.ఎస్.మండల అధ్యక్షులు రవీందర్, సి.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్య తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా మొదటి రోజు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ విజయవంతం
28
Jan