మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు – “ప్రజా భద్రత పోలీసు బాధ్యత”పై అవగాహన కార్యక్రమం

BB6 TELUGU NEWS CHANNEL
జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి IPS ఆదేశాల మేరకు,24.01.2026 తేదీన మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, గండీడ్ లో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సురక్ష పోలీసు కళాబృందం, షీ టీం, AHTU టీం వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలికల భద్రతపై సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహ్మదాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో జీవిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. టీనేజ్ వయసులో అనవసరపు ఆకర్షణలకు, మొహా వ్యామోహాలకు లోనై విలువైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

చదువుకోవాల్సిన వయసులో చదువుపైనే దృష్టి పెట్టాలని, బాల్య వివాహాల వల్ల బాలికల జీవితం దుర్భరంగా మారుతుందని, అలాంటి ఘటనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టం – 2012, సైబర్ భద్రత గురించి వివరించి, సోషల్ మీడియా ద్వారా అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వీడియో కాల్స్, ఫోటోలు షేర్ చేయడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

బాలికలు ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, అవసరమైతే “నో” అని స్పష్టంగా చెప్పడం, ఒంటరిగా ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో సహాయం కోరడం చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ Dial 100 లేదా షీ టీం నంబర్ 8712659365 ను నిర్భయంగా సంప్రదించాలని అన్నారు.

కార్యక్రమంలో
గండీడ్ తహసీల్దార్ మల్లికార్జునరావు, MPDO శ్రీమతి మంజులత, సుజాత ఎస్ఐ
విద్యాలయం SO శ్రీమతి శివలీల, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, షీ టీం, AHTU టీం మరియు పోలీసు కళాబృందం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పి. శ్రీనివాస్ ఇన్స్పెక్టర్
మహిళా పోలీస్ స్టేషన్
I/C సురక్ష పోలీసు కళాబృందం
మహబూబ్ నగర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe