BB6 TELUGU NEWS CHANNEL
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి,అక్రమాలను ప్రశ్నించినందుకే మొన్న హరీష్ రావు కు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు ఇచ్చారని, పరిపాలనను గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేటీఆర్ కు,హరీష్ రావు కు నోటీసులు ఇస్తూ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూన్నారని,ప్రజా వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే ఈ నోటీసుల డ్రామాలని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ద్వజ మెత్తారు.బీఆర్ఎస్ పార్టీకి చట్టం పట్ల,న్యాయ స్థానాల పట్ల గౌరవం ఉందని.ఎన్ని నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల పట్ల పోరాటం ఆపదని నవీన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి ఉమ్మడి నవీన్ రెడ్డి ఆగ్రహం
22
Jan