అట్టహాసంగా చేగుర్ క్లస్టర్ ఆటల పోటీలు.క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ఆకట్టుకున్న సర్పంచ్ మాంకాల శ్రీశైలం ముదిరాజ్.

మట్టిలో మాణిక్యాలు గ్రామీణ విద్యార్థులు.
పోటీల ప్రారంభం అనంతరం సర్పంచ్ శ్రీశైలం.

ప్రజాప్రతినిధులు అంటే కేవలం గ్రామంలో పనులు చేయడమే కాదు,అప్పుడప్పుడు యువత,విద్యార్థులతో కలసి ఆటలు ఆడటం కూడా అని చూపిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు.అలాంటి కోవలోకే వస్తారు చేగూర్ గ్రామ ప్రథమ పౌరుడు కొత్తగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్ మాంకాల శ్రీశైలం ముదిరాజ్..సీఎం కప్ క్రీడాపోటీలలో భాగంగా గురువారం చేగూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేగుర్ క్లస్టర్ లెవెల్ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటిలలో ఏడు గ్రామ పంచాయతీలు చేగూర్,బండోని గూడ,బుగ్గోని గూడా, చేగుర్,కన్హా,నర్సప్పగూడ, తాళ్లగూడ,వెంకమ్మగూడ గ్రామాలకు చెందిన దాదాపు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.కబడ్డీ, కోకో, వాలీబాల్, చెస్, క్యారమ్స్, నిర్వహించడం జరిగిందని సర్పంచ్ శ్రీశైలం తెలిపారు.కబడ్డీ టీమ్ తో కలసి సరదాగా కాసేపు సర్పంచ్ శ్రీశైలం ఆడి,క్రీడాకారులను,యువతను ఆకట్టుకున్నారు.ఎంపికైన క్రీడాకారులను క్లస్టర్ ఇంచార్జ్ బి గోపాల్ సింగ్,ఫిజికల్ డైరెక్టర్ మండల స్తాయికి పంపించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చేగుర్ గ్రామ యువ సర్పంచ్ శ్రీశైలం ముదిరాజ్,చేగుర్ ఫిజికల్ డైరెక్టర్ సిద్ధార్థ,చేగుర్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ఉపాధ్యాయులు మురళీకృష్ణ,పంచాయతీ సెక్రటరీ శ్రీమతి వీణ,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,చేగురు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,శాంతినికేతన్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది…

కబడ్డీ ఆడుతూన్న సర్పంచ్ శ్రీశైలం..
క్రీడాకారులతో సర్పంచ్ శ్రీశైలం ముదిరాజ్..
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe