క్రిస్మస్ మనందరికీ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సహనాన్ని, క్షమాగుణాన్ని నేర్పుతుంది – MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిలా తాండూరు పట్టణంలోని మెథడిస్ట్ చర్చ్, మిరకల్ గాస్పల్ చర్చ్ మరియు రాజీవ్ కాలనీలో క్రైస్తవ సోదర, సోదరీమణులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ..

అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.

ఈ పవిత్ర మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్ లు ఈ పండగ జరుపుకుంటున్నారు.

ఏసు ప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారు.

ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు.

యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలి, అందరూ సంతోషంగా ఉండాలి.

ఈ వేడుకలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe