చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్

BB6 TELUGU NEWS CHANNEL
  మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు తేది 20.12.2025 శనివారం ఉదయం 10 గంటలకు ప్రాథమిక పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి మేడం మాట్లాడుతు విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్థానికంగా మీ ప్రాంతంలో దొరికే పండ్లను కూరగాయలు విద్యార్థులకు అందించాలి. నేడు చలికాలం కాబట్టి విపరీతంగా చలి ఉన్నది పిల్లలను బయటకు పంపించరాదు.చలి ఎక్కువ ఉన్నందున పిల్లల్లో న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమిటో అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలావరకు ఇంటిలో ఉన్న ఆహార పదార్థాలను వాడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఇంటిదగ్గర హోంవర్క్ చేసే విధంగా చదువుకునే విధంగా కూడా శ్రద్ధ చూపాలని చెప్పడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు అన్ని రకాలుగా మా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య బి.మల్లేష్, కె. వెంకటయ్య విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe