సర్పంచ్‌ గెలిచిన సంబరాల్లో యువతిపై అత్యాచారం. యువతి మృతి.. గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్లు అనుమానం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో బుధవారం రాత్రి సర్పంచ్‌ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతుండగా.. రైతు వేదిక వద్దకు యువతి(22)ని తీసుకెళ్లి అత్యాచారం చేసిన విష్ణు అనే యువకుడు

యువతి తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోవడంతో.. ఎన్నికల విజయోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్‌తో రైతు వేదిక వద్ద మీ అమ్మాయి కుప్పకూలిపోయిందని కట్టుకథను అల్లి యువతి తల్లికి సమాచారమిచ్చిన విష్ణు

యువతిని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి, అక్కడి నుండి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన యువతి తల్లి, యువకుడు

అప్పటికే యువతి మరణించినట్లు వైద్యులు తెలపడంతో, తిరిగి మృతదేహాన్ని రైతు వేదిక వద్దకు తెచ్చిన వీరు

ఉదయం గ్రామస్తులు అక్కడకు వెళ్లి చూడగా సంఘటన స్థలంలో ఉన్న ఆనవాళ్లు, రక్తస్రావమైన దుస్తులు కనిపించడంతో ఒకరికన్న ఎక్కువ మంది అత్యాచారానికి ఒడిగట్టారని అనుమానాలు

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe