సర్పంచుల్లో సగం మంది బీసీలే..10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం

BB6 TELUGU NEWS CHANNEL

▪︎2,186 రిజర్వుడ్ సహా 2,937 జనరల్ స్థానాలూ కైవసం సీట్లు

▪︎అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524

▪︎వికారాబాద్లో 364, రంగారెడ్డిలో329, భువనగిరిలో 304

▪︎10,223 నాన్ షెడ్యూల్ జీపీలకుగాను 5,123 చోట్ల విషయ

పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి, జనరల్ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వుడ్ స్థానాలతో పాటు జనరల్ కేటగిరిలోని 2,937 స్థానాల్లోనూ విజయబావుటా ఎగురవేశారు. మొత్తం12,760 పంచాయతీల్లో 2,537 ఏజెన్సీ గ్రామాలు పోగా.. మిగిలిన 10,223 నాన్ షెడ్యూల్ జీపీల్లో ఏకంగా 5,123 చోట్ల (50శాతం) బీసీ బిడ్డలు సర్పంచులుగా విజయం సాధించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా సగం స్థానాల్లో సర్పంచ్ లుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అత్యధిక బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ టాప్ లో నిలిచింది. కానీ మొత్తం సీట్లతో పోల్చినప్పుడు సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బీసీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఆ మండలంలో ఓసీలకు ఒక్క సీటు రాలేదు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో బీసీలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 7 జనరల్ స్థానాల్లోనూ బీసీలే విజయం సాధించారు. రిజర్వ్ స్థానాలతో కలుపుకుని మొత్తం 11 మంది బీసీ సర్పంచులు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో ఓసీలకు ఒక్క సర్పంచ్ పదవీ దక్కలేదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe