BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ నేడు (డిసెంబర్ 14) జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ విడతలో మొత్తం 3,911 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టారు.
ఇప్పటికే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.
నేడే రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. 3,911 పంచాయతీల్లో పోలింగ్
14
Dec