BB6 TELUGU NEWS CHANNEL
11.12.2025 రోజున జరుగు మొదటి విడత గ్రామ పంచాయతి ఎన్నికలు జరుగుతున్న గండీడ్,మొహమ్మదాబాద్, రాజాపూర్, నవాబ్ పెట్ & మహబూబ్ నగర్ రూరల్ (5) మండలాలకి సంబందించి ఓటరు స్లిప్స్ పంపిణి కార్యక్రమము 7.12.2025 నుండి 11.12.2025 వరకు పూర్తి చేసే విధంగా మండల తహసిల్దార్ల పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ),మహబూబ్ నగర్ గండీడ్ మండలం నుండి Webex ద్వారా (5) మండలాల తహసిల్దార్లను ఆదేశించడం జరిగినది. BLO లు వారికి సంబందించిన PS లలో ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్స్ పంపిణి సజావుగా సాగే విదంగా ఆదేశించడం జరిగినది. BLOలు ఎట్టి పరిసితిలలో కుటుంబ వ్యక్తులకు కాకుండా వేరే వ్యక్తులకు ఓటర్ స్లిప్స్ లను ఇవ్వకూడదు. ఒక వేళ అట్టి ఇంటికి తాళం వేసి ఉన్న ఎడల మరునాడు ఆ ఇంటికి వెళ్లి ఓటరు స్లిప్ పంపిణి చేయవలయును. వేరే ఏ ఇతర కారణాల వలన వారు లేని ఎడల పోలింగ్ రోజున పోలింగ్ బూతు ప్రాంతంలో BLO కూర్చొని అట్టి వారికి మాత్రమే ఓటరుస్లిప్ ఇవ్వగలరు. ఈ విదంగా కాకుండా ఏకమొత్తం లో ఒకరికి కాని లేదా ఏ పార్టీకి సంబందించిన వారికి కాని ఓటర్ స్లిప్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఏకమొత్తం లో ఒకరికి కాని లేదా ఏ పార్టీకి సంబందించిన వారికి కాని ఓటర్ స్లిప్స్ ఇచినట్టు తెలిసిన ఎడల ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకోనబడును. అదే విధంగా BLO ఓటర్ స్లిప్స్ పంపిణి చేయునపుడు తప్పకుండ రసీదు పై సంబందిత వారి సంతకం తీసుకొనవలెను. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మరియు గండీడ్ మండల తహసిల్దార్ బ్రహ్మరౌతూ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
