ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్

BB6 TELUGU NEWS CHANNEL
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్. 2018 నుండి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టిన భాను ప్రకాష్
ఏపీ – రాయచోటికి చెందిన భాను ప్రకాష్.. అంబర్‌పేట్ పీఎస్‌లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వహణ. ఏపీలో ఎలక్ట్రిక్ ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని కోరిన భాను ప్రకాష్.. వెపన్ డిపాజిట్ కోరడంతో బయటపడ్డ ఉదంతం.ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని ఓ దుకాణంలో కుదువ పెట్టిన భాను ప్రకాష్ లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై, యజమాని బంగారం తిరిగి అడగగా, కనిపించడం లేదని చెప్పిన ఎస్ఐ. దీంతో విచారించి ఆ దుకాణం నుండి బంగారాన్ని రికవరీ చేసి, భాను ప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.
2018 నుండి బెట్టింగ్‌లకు అలవాటై భాను ప్రకాష్ రూ.కోటిన్నర పోగొట్టినట్లు, ఈ క్రమంలోనే సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టినట్లు తెలిపిన పోలీసులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe