ఘనంగా సహకార సంఘం వార్షికోత్సవ వేడుకలు..వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ

BB6 TELUGU NEWS CHANNEL
72 వ జాతీయ సహకార సంఘం వార్షికోత్సవ వేడుకలను ఉమ్మడి గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సహకార సంఘం జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని, రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అందిస్తున్న సేవలను రైతులు వినియోగించుకొని ఆర్థికంగా  అభివృద్ధి చెందాలని అన్నారు. నవంబర్ 14 నుంచి 20 వరకు వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి కావున రైతులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సొసైటీ సీఈఓ ఆశన్న, సిబ్బంది ఖాజా,వెంకటయ్య,గోవర్ధన్, చెన్నయ్య,శేఖర్,రాములు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe