BB6 TELUGU NEWS CHANNEL
కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం గండీడ్ మండలం మరియు రైస్ మిల్లులు తనిఖీ మరియు లైసెన్సెడ్ సర్వేయర్ల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్*
అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుసూదన్ నాయక్ గారు గండీడ్ మండలం లో గల కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీ చేయడం జరిగింది అక్కడ వర్షం నీరు నిలువ ఉండటం మరియు పరిసరాలు అపరిశుభ్రం ఉండటం చూసి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కు షోకాస్ నోటీసు ఇవ్వాలని డి ఇ ఓ ను ఆదేశించారు, మరియు అక్కడ దోమలు రాకుండా పరిసరాల ను శుభ్రం చేయాలని మండల పరిషత్ అధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అలాగే గండీడ్ మండలంలో గల రైస్ మిల్లులను తనిఖీ చేసిసి ఎంఆర్ డెలివరీ ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని రైస్ మిల్లుల యాజమాన్యంని ఆదేశించారు.
అలాగే ప్రభుత్వ బాలుర కళాశాలలో లైసెన్సడ్ సర్వేయర్లకు జరుగు వ్రాత పరీక్ష కేంద్రాని జిల్లా అధికారులు ఏ డి సర్వే కిషన్ రావు మరియు పీడీ హోసింగ్ భాస్కర్ గారితో పరిశీలించడం జరిగింది.
గండీడ్ మండల కేంద్రంలో పర్యటించిన రెవెన్యూ అదనపు కలెక్టర్
26
Oct